కాలం మారింది.. కాలంతో పాటూ ఆదాయ మార్గాలూ మారాయి. మారడం అంటే అలా ఇలా కాదు.. ఇంటిలో కూర్చునే మూడు తరాలు తిన్నా తరగనంత సంపాదించుకునే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. ప్రధానంగా ఆన్లైన్ వేదికగా.. అత్యంత తేలికగా వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలను అలవోకగా సంపాదించుకునే అత్యద్భుతమైన అవకాశాలు అందరికీ అందుబాటులోనికి వచ్చాయి. కాకపోతే.. వాటిని అందరూ వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. రెండు చేతులా.. కాదు.. కాదు.. పది చేతులా సంపాదించుకుంటున్నారు. నూనుగు మీసాలు కూడా రాకుండానే బిలియనీర్లుగా ఎదుగుతున్నారు.
ఈ ఆధునిక సంపాదన మార్గాలను అందిపుచ్చుకోలేకపోతున్న వాళ్లు ఇంకా.. దశాబ్దాల కిందటి పద్ధతుల్లోనే.. చిన్న చిన్న ఉద్యోగాలు.. వ్యాపారాలు చేసుకుంటూ బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు. చదువుతో సంబంధం లేకుండా.. వేల పద్ధతుల్లో ఇంటర్నెట్ ద్వారా ఆదాయార్జన చేస్తున్న వాళ్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ.. వీరిలో విదేశీయులే అధికంగా ఉన్నారు. మనవాళ్లకు వాటి గురించి సరిగా తెలియక.. చెప్పేవాళ్లు లేక.. తెలివితేటలు ఉన్నా.. వాటి గురించి కాస్త సమాచారం అందించే వాళ్లు లేక.. దూరంగా ఉండిపోతున్నారు. అందుకే.. ప్రపంచం ముంగిటకు వచ్చిన ఈ ఆధునిక ఆదాయ మార్గాలను అందరికీ చేరువ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే నేను ఈ పుస్తకం రాయడం జరుగుతోంది. ఆధునిక అవకాశాలు కొందరికే కాదు.. అందరికీ చేరువ చేయాలనేదే నా తపన.
ప్రస్తుతం ఒక కంప్యూటర్.. దానికి ఓ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. ఇంటిలో కూర్చునే వేల పద్ధతుల్లో సంపాదించుకునే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ 100 ఆదాయ మార్గాల గురించి మీకు ఈ పుస్తకంలో నేను వివరించడం జరిగింది. వచ్చే దశాబ్దానికి పనికి వచ్చే అన్ని అంతర్జాలం ఆదాయ మార్గాల గురించి ఒకే పుస్తకం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వర్క్ ఫ్రం హోమ్.. అంటే ఇంటిలో కూర్చుని హాయిగా పనిచేసుకోవడం, ఫ్రీలాన్సింగ్.. అంటే నచ్చిన పనిని నచ్చినట్టుగా.. నచ్చిన సమయంలో.. నచ్చినచోట కూర్చుని చేస్తూ సంపాదించుకోవడం.. ఈ రెండు పద్ధతులు ప్రస్తుతం ఉన్న యువత, మధ్య వయసు వాళ్లు, మహిళలు, గృహిణులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు.. అందరికీ చాలా ఇష్టమైనవి. ఎందుకంటే.. ఇక్కడ బాస్‌లు ఉండరు.. పని ఒత్తిడి మాటే లేదు.. టార్గెట్లు అసలే ఉండవు. అందుకే.. గత మూడు శతాబ్దాల్లో వచ్చిన ఐటీ, కంప్యూటర్స్, ఎలక్ర్ట్రానిక్స్, ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్.. రివల్యూషన్స్ కంటే.. అత్యంత శక్తివంతమైన రివల్యూషన్‌గా.. వర్క్ ఫ్రం హోం, ఫ్రీలాన్సింగ్ అనేవి మారిపోయాయి.
పని కోసం మనం వెతుక్కుని వెళ్లే రోజులు పోయాయి.. పనే మనల్ని వెతుక్కుంటూ.. మన ఇంటిలోనికి వచ్చేసిన రోజులివి. దీనికోసం పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు.. కొంచెం నాలెడ్జ్ సంపాదిస్తే చాలు. ఆ నాలెడ్జ్‌ను పుష్కలంగా.. మీకు కావాల్సినంత ఈ పుస్తకంలో నేను అందించాను. కేవలం సంపాదించే మార్గాలే కాదు.. వాటిలో ఉన్న సాధకబాధకాలు, కష్టనష్టాలు, మోసాలు, స్కాములు.. అన్నింటి గురించి మీకు స్పష్టంగా.. అత్యంత తేలికగా అర్థమయ్యేలా వివరించాను. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్జిస్తున్న వాళ్లంతా.. ఈ వంద ఆదాయ మార్గాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ వారిలో ఒకరిగా.. మారిపోండిక.