First person in telugu history who started computer literature in 1996 & Editor of " Computer Era Telugu Magazine " Nallamothu Sridhar 's Technical Channel.


Wonderful studio quality Tutorials on Android, iOS, Windows Phone, Social Networking, Security, Microsoft Windows, MS Office, Photoshop , Viruses etc.. in Telugu.

Catch me on:


http://computerera.co.in

http://youtube.com/nallamothu

http://nallamothusridhar.com

http://www.facebook.com/nallamothusridhar

ఇంట్లో వాళ్లు బయటకు వెళితే Google Mapsలో రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్ చేసే సదుపాయం నుండి.. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంటే ఆ విషయం కుటుంబ సభ్యులకి నోటిఫికేషన్ వెళ్లే వరకూ... పానిక్ బటన్‌తో సహా ఎన్నో ఆప్షన్లు, అప్లికేషన్లు ఒక మొబైల్ ఫోన్లో లభిస్తున్నాయి.

అశ్రద్ధ చెయ్యకుండా నిరంతరం వాటిని వాడాల్సిన అవసరం చాలా ఉంది. మన ఫోన్లే మనకు తగినంత రక్షణ కల్పించగలవు.. చాలా సందర్భాల్లో!! టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు జరిగిన దారుణాలే టెక్నాలజీ వచ్చాక కూడా అదే స్థాయిలో జరుగుతుంటే.. మనం అప్రమత్తం అవకపోతే చాలా కష్టం.

- Nallamothu Sridhar

మహిళలకు గమనిక:

మీ మొబైల్‌లో అర్జెంటుగా 112 నెంబర్‌ని సేవ్ చేసుకోండి. అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాంటాక్ట్ హోమ్ స్క్రీన్‌‌లో షార్ట్ కట్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్‌లో Panic Button ఉంటుంది. పోలీస్, ఫైర్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ వంటి అన్ని సర్వీసులకి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ ఇది.

మీ ఫోన్లో Panic Button ప్రెస్ చేయాలంటే.. పవర్ బటన్‌ని మూడుసార్లు వెంటవెంటనే ప్రెస్ చేస్తే చాలు.. అది 112కి కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వారు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని లాంగ్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. 2018కి ముందు కొన్న ఫోన్లలో ఈ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు 112 నెంబర్ సేవ్ చేసుకుని, ప్రమాదంలో ఉన్నప్పుడు దానికి డయల్ చెయ్యాలి. లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 112 India అనే ఈ లింకులోని మొబైల్ యాప్‌ని మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి కూడా సహాయం పొందొచ్చు. https://play.google.com/store/apps/details?id=in.cdac.ners.psa.mobile.android.national&fbclid=IwAR0EzA4rJZPk4WvZ7IpKgyhX3FHpzUhiGVndQA7SiSZuvIfauMxY7XDstzE

- Nallamothu Sridhar



Course Curriculum

  First Section
Available in days
days after you enroll
Sridhar Nallamothu

Sridhar Nallamothu

నా గురించి:

నా లక్ష్యం ఒక్కటే.. క్లిష్టతరమైన టెక్నాలజీని సామాన్య తెలుగు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం! అదే లక్ష్యంతో 1996 నుండి కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేస్తూ,600లకు పైగా టివి ప్రోగ్రాములు, రేడియో ఫోన్-ఇన్ ప్రోగ్రాములూ, MCA, B-Tech విద్యార్థులకు కాలేజ్ సెమినార్లూ, రీడర్స్ మీటింగులూ, వెబినార్లూ, ఆన్‌లైన్ ఛాట్, ఫోరమ్, బ్లాగ్, వందలకొద్దీ టెక్నికల్ వీడియోలూ.. ఇలా రకరకాల మార్గాల ద్వారా పనిచేసుకుంటూ వెళుతున్నాను. In one word.. I am living my life with clear vision and dedicated work

Select a pricing plan and sign up

FREE

Free Course